schedule Wednesday, September 09, 2026

రైతన్నా.. నీకేందీ.. యాతనా..!

calendar_today September 11, 2025
person dharshininews
రైతన్నా.. నీకేందీ.. యాతనా..!
రైతన్నా.. నీకేందీ.. యాతనా..! - యూరియా కోసం ఆగమాగం - వర్షంలో తడుస్తూ బారులు తీరిన వైనం - పెద్దేముల్ మండలంలో ఇబ్బందులు తాండూరు, దర్శిని ప్రతినిధి : యూరియా బస్తాల కోసం రైతులు యాతన పడుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్నదాతలు పడుతున్న కష్టాలు కలవరపెడుతూనే ఉన్నాయి. kvcs తాజాగా వికారాబాద్‌ జిల్లాలో రైతులు వర్షంలో కూడా యూరియా బస్తాల కోసం బారులు తీరారు. గురువారం పెద్దేముల్ మండల కేంద్రానికి యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీశారు. ఉదయం వేళ అకస్మాత్తుగా మోస్తారు వర్షం ప్రారంభమయ్యింది. అయినా కూడా రైతులు క్యూలైన్‌ నుంచి దాటలేదు. రైతులు, మహిళలు సహాకార కేంద్రం వద్ద వర్షంలోనే తడుస్తూ బస్తాల కోసం పడిగాపులు కాశారు. బస్తాలైనా, టోకెన్లైనా తీసుకోవాలని పట్టు విడవలేదు. పంటలను కాపాడుకునేందుకు రైతన్నలకు ఎంత యాతనొచ్చిందిరా దేవుడా అని పలువురు రైతులు ఆవేధనకు గురయ్యారు. మరోవైపు సహాకార కార్యాలయం వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38512/