schedule Thursday, September 03, 2026

చైతన్యలో ఫుల్ జోష్..!

calendar_today September 13, 2025
person dharshininews
చైతన్యలో ఫుల్ జోష్..!
చైతన్యలో ఫుల్ జోష్..! - ఉత్సహాంగా ఫ్రెషర్స్ డే వేడుకలు - ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు - పాల్గొన్న కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాలలో ఫుల్ జోష్ నిండింది. శనివారం కాలేజీ విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సహాంగా జరుపుకున్నారు. పట్టణంలోని తులసీ గార్డెన్ లో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి కాలేజీ అద్యాపకులతో కలిసి హాజరయ్యారు. ఫ్రెషర్స్ వేడుకల సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు వేరు వేరుగా చేసిన డ్యాన్స్ లు స్పెషల్ ఆట్రాక్షన్ గా నిలిచాయి. విద్యార్థులు చిందులు వేస్తూ.. విజిల్స్ కొడుతూ సందడి చేశారు. అనంతరం కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు. విద్యార్థులు ఏర్పరుచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా చైతన్య కళాశాల విద్యను అందిస్తోందని అన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి కాలేజీకి, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జగ్జీవన్ రెడ్డి, అధ్యాపక బృందం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38564/