schedule Thursday, September 10, 2026

రాముని గుడికి తల్లి పేరుపై విరాళం

calendar_today September 14, 2025
person dharshininews
రాముని గుడికి తల్లి పేరుపై విరాళం
రాముని గుడికి తల్లి పేరుపై విరాళం - ఆలయ ద్వారం కోసం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని రామ మందిరంకు ఓ కుమారుడు తల్లి జ్ఞాపకార్థం విరాళం అందజేశారు. గత కొన్ని నెలలుగా ఇందిరానగర్ లోని రామ మందిర పునర్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం దేవాలయ ద్వారం కోసం అవుసుల సత్యం అనే భక్తుడు తల్లి అవుసుల మాణెమ్మ జ్ఞాపకార్తం రూ.37 వేల నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రామ మందిర దేవాలయ పునర్ నిర్మాణంలో భక్తులు భాగస్వామ్యం కావాలని కోరారు. నిర్మాణం కోసం వస్తు రూపేణ, నగదు రూపంలో అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38597/