schedule Sunday, July 05, 2026

బంగారం పట్టిన పటేల్ జయశ్రీ..!

calendar_today September 15, 2025
person dharshininews
బంగారం పట్టిన పటేల్ జయశ్రీ..!
బంగారం పట్టిన పటేల్ జయశ్రీ..! - తెలంగాణ రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్‌ - ఓపెన్ పికిల్ ఛాంపియన్‌షిఫ్‌లో ప్రతిభ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు పటేల్ జయశ్రీ రవిశంకర్ బంగారు పతకాన్ని సాధించారు. kvcs తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరిగిన ఓపెన్ పికిల్ బాల్ ఛాంపీయన్ షిప్‌లో గోల్డ్ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్‌లో అమెచూర్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వ తెలంగాణ స్టేట్ ఓపెన్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ 2025 నిర్వహించారు. 35 సంవత్సరాలు పైబడిన వారికి అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో తాండూరుకు చెందిన జయశ్రీ పటేల్ రవిశంకర్ పాల్గొన్నారు. ఈ పోటీలో జయశ్రీ పటేల్ ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్స్ సాధించారు. దీంతో ఆమెను కాశ్మీర్‌లో జరిగే నేషనల్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పటేల్ జయశ్రీ గారు మాట్లాడుతూ స్టేట్ లెవెల్లో సత్తా చాటిన విధంగా జాతీయ స్థాయిలో కూడా గొల్డ్ మెడల్ తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పటేల్ రవిశంకర్‌ సంతోషం వ్యక్తం చేయగా.. పలువురు పటేల్ జయశ్రీకి అభినందనలు తెలిపారు. ఇదికూడ చదవండి.... https://www.dharshininews.com/38603/