సామాజిక సేవే ఆర్ఎస్‌కే ఫౌండేషన్ లక్ష్యం..!
September 17, 2025
dharshininews
సామాజిక సేవే ఆర్ఎస్‌కే ఫౌండేషన్ లక్ష్యం..!
- సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
- ఆర్ఎస్‌కే ఫౌండేషన్ చైర్మన్ డా. రొంపల్లి సంతోష్ కుమార్
- దామర్ చేడ్ పాఠశాలకు అల్మారా వితరణ, ఉపాధ్యాయులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవే ఆర్ఎస్‌కే ఫౌండేషన్ లక్ష్యం అని ఫౌండేషన్ చైర్మన్ డా. రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం దామర్ చేడ్ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లో ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని ఆర్ఎస్‌కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు.
అదేవిధంగా ఫౌండేషన్ తరుపున పాఠశాలకు అల్మారాను వితరణ చేశారు. ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్‌కే ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవ అందించడమే లక్ష్యమన్నారు. పేద విద్యార్థులు అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలలకు తమవంతు తోడ్పాటు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు.
అదేవిధంగా సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో పవిత్రం, కీలకమైందని అన్నారు. విద్యార్థుల తలరాతలను మార్చి.. మంచి పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయుల్లో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రఘునాథ్ రెడ్డి, సోమశేఖర్, సత్యవర్ధన్ రెడ్డి, దామర్ చేడ్ శంకర్ స్వామి, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/38633/