schedule Sunday, July 05, 2026

మార్కండయే కాలనీ అభివృద్ధిపై దృష్టి

calendar_today September 19, 2025
person dharshininews
మార్కండయే కాలనీ అభివృద్ధిపై దృష్టి
మార్కండయే కాలనీ అభివృద్ధిపై దృష్టి - సందర్శించిన బీఎస్ఆర్, మున్సిపల్ కమీషనర్ - కాలనీలో అభివృద్ధి పనుల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి 13వ వార్డులోని మార్కండేయ కాలనీ అభివృద్ధిపై దృష్టిసారించాలని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమీషనర్ యాదగిరి పరిశీలించారు. kvcs అదేవిధంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కూడా కాలనీని సందర్శించారు. కాలనీ అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను శ్రీనివాస్ రెడ్డి కమీషనర్ యాదగిరితో చర్చించారు. కాలనీలో అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేసేలా దృష్టిసారించాలని శ్రీనివాస్ రెడ్డి కమీషనర్కు సూచించారు. అనంతరం కమీషనర్ యాదగిరి కాలనీలో పర్యటించారు. మురుగు కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంకా త్వరలో చేపట్టబోయే సీసీ రోడ్లు, మురుగు కాలువల, వీధి దీపాల తదితర సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బంటు వేణుగోపాల్, వికాష్ జోషి, మున్సిపల్ ఏఈ ఉదయ్ కుమార్, కాలనీ పెద్దలు, యువకులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38665/