సుశాంత్‌కు మెరుగైన వైద్యం అందించాలి
September 19, 2025
dharshininews
సుశాంత్‌కు మెరుగైన వైద్యం అందించాలి
- చెట్టు కొమ్మ విరిగి గాయపడిన బాలుడికి ఎమ్మెల్యే పరామర్శ
- వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించిన మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చెట్టు కొమ్మ విరిగి మీదపడి గాయపడిన బాలుడు సుశాంత్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వైద్యులను కోరారు.
తాండూరు మండలం జినుగుర్తి మోడల్ స్కూలుకు చెందిన సుశాంత్ గురువారం బషీరాబాద్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరుగుతున్న జోనల్ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు వెళ్లాడు. అక్కడి మైదానంలో నిలబడి ఉండగా పెద్ద చెట్టు కొమ్మ విరిగి తలపై పడడంతో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం బాలుడిని హైదరాబాద్‌లోని ఆలీవ్ ఆసుపత్రికి తరలించారు.
శుక్రవారం ఈ విషయం తెలుసుకుకున్న ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. బాలుడిని పరామర్శించారు. ప్రమాదం గురించి అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని వైద్యులను కోరారు. అదేవిధంగా బాలుడి వైద్య ఖర్చుల కోసం రూ. 20వేల ఆర్థిక సాయంను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆందోళన చెందవద్దని.. అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందించారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/38667/