schedule Saturday, July 04, 2026

ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణకు కృషి

calendar_today September 22, 2025
person dharshininews
ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణకు కృషి
ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణకు కృషి - మహిళలు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి - తాండూరు ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటి తాండూరు, దర్శిని ప్రతినిధి : రానున్న రోజుల్లో మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటి సభ్యులు అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో గత 5 నెలలుగా ఇస్తున్న టైలరింగ్ శిక్షణ తరగతులు ముగిశాయి. ఇందులో భాగంగా సోమవారం సోసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు కమల్ అతహర్ సమక్షంలో కార్యదర్శి మహమ్మద్ యూనుస్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 65 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, అమ్మాయిలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించేందుకు సోసైటీ దృష్టిసారిస్తోందని అన్నారు. ఈ శిక్షణ తరగతులను అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో తాండూరులో ఫ్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. kvcs అదేవిధంగా టైలరింగ్ లో శిక్షణ పొంది.. పరీక్షలు రాసిన వారిలో ప్రతిభను కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. అంతకుముందు ఫ్యాషన్ డిజైనర్ ఉమ్మే సాఫియా ఫ్యాషన్ డిజైన్ పై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో సోసైటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ ఖవి, బాసిత్ అలీ, సలీం, కార్యదర్శి ఖయ్యూమ్ అతహర్, కోశాధికారి సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38718/