schedule Sunday, July 05, 2026

నాపరాతి వ్యాపారులకు మనోహరన్న భరోసా..!

calendar_today September 22, 2025
person dharshininews
నాపరాతి వ్యాపారులకు మనోహరన్న భరోసా..!
నాపరాతి వ్యాపారులకు మనోహరన్న భరోసా..! - వ్యాపారుల సమస్యల పరిష్కారానికి మంత్రికి విజ్ఞప్తి - ఎమ్మెల్యేను కలిసిన స్టోన్, క్వారీ అసోసియేషన్ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని నాపరాతి వ్యాపారులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భరోసా కల్పించారుఉ. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. సోమవారం తాండూరు స్టోన్ మర్చంట్స్, క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ నూతన కార్యవర్గ సభ్యులు, వ్యాపారులు హైదరాబాద్ లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వ్యాపారులు తమ సమస్యలు, ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. ఇందుకు స్పందించిన మనోహర్ రెడ్డి వెంటనే సంబంధిత శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామితో ఫోన్లో మాట్లాడారు. తాండూరు నాపరాతి వ్యాపారుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి సహకారంతో తాండూరు నాపరాతి వ్యాపారుల సమస్యలు పరిష్కరించడంతో పాటు అభ్యున్నతికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. kvcs ఈ కార్యక్రమంలో ది స్టోన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అప్పూ(నయూం), ది తాండూరు మండల క్వారీ ఓనర్స్ వెల్పేర్ అసోయేషన్ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షులు ఎంఏ సత్తార్, విజయ్ రమణ రావు, ప్రధాన కార్యదర్శి కుంచెం మురళిధర్, సంయుక్త కార్యదర్శులు సయ్యద్ హబీబ్, బ్రిజ్ మోహన్ బూబ్, కోశాధికారి సంజీవ్ కుమార్, ది తాండూరు మండల క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోయేషన్ ఉపాధ్యక్షులు మహమ్మద్ అన్వర్ అహమ్మద్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ జుబేర్ లాల, మహమ్మద్ జైనుద్దీన్, మసూద్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38720/