schedule Wednesday, September 09, 2026

తిరుపతి రెడ్డితో బీఎస్ఆర్ దంపతుల భేటి

calendar_today September 23, 2025
person dharshininews
తిరుపతి రెడ్డితో బీఎస్ఆర్ దంపతుల భేటి
తిరుపతి రెడ్డితో బీఎస్ఆర్ దంపతుల భేటి - విగ్రహం అందించి సన్మానించిన శ్రీనివాస్ రెడ్డి దంపతులు - సామాజిక సేవా, అభివృద్ధిపై చర్చ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు, కోడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతి రెడ్డితో తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా రెడ్డిలు భేటి అయ్యారు. మంగళవారం తాండూరులో పర్యటనకు వచ్చిన తిరుపతి రెడ్డిని శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఆయన నివాసంలో ఆత్మీయ స్వాగతం పలికారు. శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డి దంపతులు తిరుపతి రెడ్డికి విగ్రహాన్ని బహుమతిగా అందించారు. శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం తిరుపతి రెడ్డితో శ్రీనివాస్ రెడ్డి దంపతులు భేటి అయ్యారు. ఈ సందర్భంగా తాండూరు అభివృద్ధి, సమాజ సేవ, రాజకీయాలపై చర్చించారు. బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులు దేశ రక్షణలో భాగంగా ఆర్బీఓఎల్ నుంచి రక్షణ నిధికి ప్రతినెల రూ. 2లక్షల నిధిని అందజేయడంను తిరుపతి రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు బుయ్యని నివాసంలో తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి దంపతుల ఆత్మీయ భేటిపై నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38744/