schedule Thursday, September 10, 2026

ఇంటింటా పరిశుభ్రత పాటించాలి

calendar_today September 24, 2025
person dharshininews
ఇంటింటా పరిశుభ్రత పాటించాలి
ఇంటింటా పరిశుభ్రత పాటించాలి - స్వచ్ఛతలో అందరు భాగస్వాములు కావాలి - తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరు ఇంటింటా పరిశుభ్రతను పాటించాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి అన్నారు. బుధవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 1, 24వ వార్డులలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కమీషనర్ యాదగిరి సమక్షంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ప్రజలు ఇంటింటా పరిశుభ్రతను పాటించాలన్నారు. తడి, పొడి చెత్తలను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. స్వచ్ఛతలో అందరు భాగస్వాములై పట్టణాన్ని ఆదర్శంగా నిలపాలని విజ్ఞప్తి చేశారు. kvcs అనంతరం పారిశుద్ధ్య పనులను బాధ్యతగా నిర్వహించే మున్సిపల్ కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాలప్ప, మున్సిపల్ డీఈ మణిపాల్, మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇనుస్పెక్టర్లు ఉమేష్, వెంకటయ్య, ఈఈ ప్రవీణ్ గౌడ్, టీఎంసీ రాజేంద్రప్రసాద్, వార్డు ఆఫీసర్ శ్రీనివాస్, జవాన్లు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38775/