schedule Wednesday, September 09, 2026

శిథిలావస్థ ఇళ్లను గుర్తించండి..!

calendar_today September 26, 2025
person dharshininews
శిథిలావస్థ ఇళ్లను గుర్తించండి..!
శిథిలావస్థ ఇళ్లను గుర్తించండి..! - ప్రమాదాలు జరగకుండా దృష్టిసారించాలి - తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి.. ప్రమాదాలు జరగకుముందే ప్రజలను అప్రమత్తం చేయాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించరు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో కమీషనర్ అధికారులు, వార్డు ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ నుంచి తీసుకోవాల్సిన చర్యలపై కమీషనర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని శిథిలావస్థల ఇళ్లను గుర్తించాలని అన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకరావాలని అన్నారు. పారిశుద్ధ్యం విషయంలో, డ్రైన్లు విషయంలో ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ మణిపాల్, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇంచార్జ్ శానిటరీ ఇను స్పెక్టర్లు వెంకటయ్య, ఉమేష్, వివిధ విభాగాల అధికారులు, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38812/