బల్దియాలో బతుకమ్మ జోష్..!
September 29, 2025
dharshininews
బల్దియాలో బతుకమ్మ జోష్..!
- కార్యాలయంలో ఘనంగా వేడుకలు
- పాల్గొన్న కమీషనర్ యాదగిరి, అధికారులు
- ఆడిపాడిన ఆర్పీలు, ఉద్యోగులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకల జోష్ నిండుకుంది. సోమవారం మున్సిపల్ కమీషనర్ యాదగిరి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో బతుకమ్మను అందమైన పూలతో పేర్చి అలంకరించారు. మున్సిపల్ కమీషనర్ యాదగిరి బతుకమ్మను భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు.
కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, మహిళ ఉద్యోగులు బతుకమ్మను దర్శించుకున్నారు. అదేవిధంగా మహిళ సంఘాల ఆర్పీలు, సభ్యులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసింది. అనంతరం మహిళలు బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆట పాటలతో సందడి చేశారు. మహిళల కోలాట, అడుగుల నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండగ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ఎంతో విశిష్టత కలిగిన బతుకమ్మ వేడుకలను మన సంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ మణిపాల్, మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇను స్పెక్టర్లు వెంకటయ్య. ఉమేష్, పలు విభాగాల అధికారులు, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి....
https://www.dharshininews.com/38865/