schedule Sunday, July 05, 2026

మహిషాసుర మర్దినీ.. మమ్మేలూ తల్లీ..!

calendar_today October 1, 2025
person dharshininews
మహిషాసుర మర్దినీ.. మమ్మేలూ తల్లీ..!
మహిషాసుర మర్దినీ.. మమ్మేలూ తల్లీ..! - ప్రత్యేక అలంకరణలో వాసవీ మాత దర్శనం - నగరేశ్వర దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిషాసుర మర్దినీ.. మమ్మేలూ తల్లీ.. అంటూ తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో వెలసిన వాసవీ కన్యకాపరమేశ్వరీ మాతను భక్తులు వేడుకున్నారు. దేవాలయంలో ఆర్యవైశ్య, వాసవీ మహిళ సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్దలతో జరుగుతున్నాయి. బుధవారం 10వ రోజు వాసవీ మాతను మహిషాసుర మర్దినీగా అలంకరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో దర్శన మిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా మారింది. శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. kvcs శరన్నవరాత్రులు సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, ఆర్యవైశ్య సంఘం నాయకులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య, మహిళ సంఘం సభ్యులతో పాటు వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి, ప్రధాన కార్యదర్శి మంకాల స్వప్న రాఘవేందర్, ఉప కార్యదర్శి తాళ్లపల్లి కవిత, కోశాధికారి సింగంశెట్టి శోభ, అనుబంధ సంఘాల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38922/