schedule Thursday, September 10, 2026

రాముని గుడికి రూ.51వేల విరాళం

calendar_today October 3, 2025
person dharshininews
రాముని గుడికి రూ.51వేల విరాళం
రాముని గుడికి రూ.51వేల విరాళం - ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని రామ మందిరంకు భక్తుడు విరాళం అందించి భక్తిని చాటుకున్నాడు. గత కొన్ని నెలలుగా ఇందిరానగర్ లోని రామ మందిర పునర్ నిర్మాణం జరుగుతోంది. దేవాలయ నిర్మాణంలో భాగంగా ఇందిరానగర్‌కు చెందిన వడ్డె శ్రీశైలం 51వేలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రామ మందిర దేవాలయ పునర్ నిర్మాణంలో భక్తులు భాగస్వామ్యం కావాలని కోరారు. నిర్మాణం కోసం వస్తు రూపేణ, నగదు రూపంలో అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38936/