schedule Sunday, July 05, 2026

దసరా.. రభస..!

calendar_today October 3, 2025
person dharshininews
దసరా.. రభస..!
దసరా.. రభస..! - వేదికపై అవమానిస్తారా..? - ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అసహనం - చీఫ్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సమక్షంలో గలాట తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో జరిగిన దసరా వేడుకల్లో మళ్లీ రభస చోటు చోటు చేసుకుంది. పట్టణంలోని బోనమ్మ దేవాలయం వద్ద జరిగిన విజయదశమి వేడుకల్లో తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతి యేడాది హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పాత తాండూరులోని బోనమ్మ దేవాలయం వద్ద వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈసారి కూడా దేవాలయం వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలతో పాటు రాజకీయ నేతలు, కుల సంఘాల నాయకులు హాజరయ్యారు. ఇందులో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కూడా హాజరయ్యారు. అయితే సబా వేధికలో ముందు వరుసలో కొందరు నాయకులు, రాజకీయ రాజకులకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదిక మీదకు పిలిచి ఒక ప్రాధాన్యం, ఒక గౌరవం ఇవ్వకుండా అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. kvcs తాను గత ఐదేళ్లుగా హిందూ ఉత్సవ సమితికి రూ.51 వేల చొప్పున విరాళాలు అందిస్తున్నామని గుర్తుచేశారు. హిందు ఉత్సవ సమితికి ఎలాంటి సహకారం, తోడ్పాటు అందించని వారికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల మండిపడ్డారు. చీప్‌ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల సమక్షంలో ఈ రభస జరగడం గమనార్హం. హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు జోక్యం చేసుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో సమితి సభ్యులు విఠల్ నాయక్ కు శాలువా కప్పి సన్మానించి శాంతింప చేశారు. మరోవైపు ఇదే వేడుకలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కు కూడా ప్రాధాన్యం, గౌరవం ఇవ్వలేదని గుసగుసలాడుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38942/