schedule Saturday, July 04, 2026

తేలని బీసీ రిజర్వేషన్ బిల్లు..!

calendar_today October 8, 2025
person dharshininews
తేలని బీసీ రిజర్వేషన్ బిల్లు..!
తేలని బీసీ రిజర్వేషన్ బిల్లు..! - విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు - వాయిదాకు కారణం ఇదే.. హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లు రేపటికి వాయిదా పడింది. ఉదయం నుంచి హైకోర్టు తీర్పుపై అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. మధ్యాహ్నం తరువాత బిల్లును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్‌.కృష్ణయ్య, వి.హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లను కలిపి సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. kvcs తెలంగాణ ప్రభుత్వం తరపున మరికొన్ని వాదనలు వినిపిస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తులను కోరారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరపున అడ్వకేట్లు బలమైన వాదనలు వినిపించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను సమర్థించాయని, బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదని, చట్టం ద్వారా జారీ చేసిన GOలను ఛాలెంజ్ చేశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మరికొన్ని వాదనలు వినిపిస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తులను కోరారు. దీంతో విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టు. బీసీ రిజర్వేషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపు అంటే గురువారం (అక్టోబర్ 9) మధ్యాహ్నం 2:15గంటలకు వాయిదా వేసింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39016/