schedule Wednesday, September 09, 2026

అయోధ్య ఉత్సవాలకు జిల్లా కళాకారులు

calendar_today October 17, 2025
person dharshininews
అయోధ్య ఉత్సవాలకు జిల్లా కళాకారులు
అయోధ్య ఉత్సవాలకు జిల్లా కళాకారులు - తాండూరు నుంచి పలువురికి అవకాశం - రామజన్మభూమిలో నృత్య ప్రదర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : యూపీలోని అయోధ్యలో నిర్వహించే దీపావళి ఉత్సవాలకు వికారాబాద్ జిల్లా కళాకారులు ఎంపికయ్యారు. తాండూరు నుంచి కూడా పలువురు కళాకారులకు ప్రదర్శనలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈవిషయాన్ని తాండూరుకు చెందిన డాన్స్ మాస్టర్ రమేష్ తెలిపారు. జిల్లా నుంచి మొత్తం 15 మంది కళాకారులు అయోధ్యలో దీపావళి ప్రదర్శనకు ఎంపికయ్యారని తెలిపారు. అయోధ్యలోని రామ జన్మభూమిలోని రామ మందిరం దగ్గర బోనాలు ప్రదర్శన ఇవ్వనున్నారని తెలిపారు. kvcs తాండూరు నుంచి బ్రహ్మేంద్ర(పోతురాజు వేషాధారణ), శ్రావణి, నిఖిత, అనూషలు శివసత్తులుగా ప్రదర్శన ఇస్తారని తెలిపారు. వికారాబాద్ జిల్లా నుంచి తాండూరు కళాకారులకు కూడా అవకాశం కల్పించడం పట్ల డ్యాన్స్ మాస్టర్ రమేష్ యూపి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39175/