schedule Wednesday, September 09, 2026

కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..!

calendar_today October 17, 2025
person dharshininews
కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..!
కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..! - ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు - ఆకట్టుకున్న నరకాసుర దహనం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహరాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్) పాఠశాలలో దీపావళీ పండగ జోష్ నిండుకుంది. kvcs శుక్రవారం పాఠశాలలో ముందస్తు దీపావళీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ ల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ పాట పాడారు. అదేవిధంగా ముందస్తు దీపావళీ సందర్భంగా పాఠశాలకు చెందిన విద్యార్థులు అన్ని రక్షణ చర్యలు తీసుకుంటూ ఉత్సహంగా కాకర పువ్వొత్తులు, చిచ్చురు బుడ్డీలు, బూచక్రాలను కాల్చారు. చిన్నారుల కేరింతలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. అనంతరం పాఠశాలలో చెడుపై సాధించిన విజయాన్ని గుర్తుచేస్తూ నరకాసుర దహనం చేశారు. పాఠశాలలో దీపావళీ సంబరాలు సంతోషాన్ని నింపాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ స్కూల్లో విద్యతో పాటు పండగల ప్రాముఖ్యతను తెలుపుతూ సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన పెంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39177/