schedule Saturday, July 04, 2026

రైలు ఇంజన్లో అంతరాయం..!

calendar_today October 19, 2025
person dharshininews
రైలు ఇంజన్లో అంతరాయం..!
రైలు ఇంజన్లో అంతరాయం..! - తాండూరులో ఆగిపోయిన వాడి ప్యాసింజర్ - రెండు గంటల పాటు ప్రయాణికుల ఇబ్బందులు - అధికారులు సమస్యను ఎలా పరిష్కరించారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్యాసింజర్ రైలు ఇంజన్ లో అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన ఆదివారం తాండూరు రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి వాడి మధ్యన ప్యాసింజర్ రైలు రైల్వే ప్రయాణికులకు రవాణా సర్వీసులు అందిస్తోంది. ఎంతో మంది ప్రయాణికులు రాను, పోను ప్రయాణాలు సాగిస్తుంటారు. వాడి నుంచి వచ్చే ఈ ప్యాసింజర్ ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు తాండూరు రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. రోజూ మాదిరిగినే ఆదివారం కూడా సాయంత్రం 4గంటలకు వాడి ప్యాసింజర్ తాండూరు రైల్వే స్టేషన్ చేరుకుంది. నిమిషం తరువాత రైలు ప్రారంభం కాలేదు. వెంటనే లోకో మాస్టర్ పరిశీలించగా ఇంజన్ లో అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. kvcs మరమ్మత్తులు చేసేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. హైదరాబాద్ నుంచి లోకో మెకానిక్ ను రప్పించి మరమ్మత్తులు చేసేందుకు యత్నించినా ప్రయత్నాలు ఫలించలేదు. రైలు ఇంజన్ లో అంతరాయం ఏర్పడడం వల్ల ప్యాసింజర్ రైలు సుమారు రెండు గంటల పాటు రైల్వే స్టేషన్ లోని 1వ ఫ్లాట్ ఫారంపైనే ఉండిపోయింది. రైలులోని ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించి రైలును తిరిగి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. గూడ్స్ రైలుకు ఉన్న ఇంజన్ ను ప్యాసింజర్ రైలుకు అటాచ్ చేశారు. ప్యాసింజర్ రైలు, ఇంజన్ ను గూడ్స్ రైలు ఇంజన్ సాయంతో సికింద్రాబాద్ కు పంపించారు. దీంతో ప్రయాణికులు ఊరట చెందారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/39187/