schedule Saturday, July 04, 2026

మిస్టరీ డ్రోన్లు మళ్లీ ప్రత్యక్షం..!

calendar_today October 25, 2025
person dharshininews
మిస్టరీ డ్రోన్లు మళ్లీ ప్రత్యక్షం..!
మిస్టరీ డ్రోన్లు మళ్లీ ప్రత్యక్షం..! - తాండూరులో వరుసగా రెండో రోజు చక్కర్లు - భయాందోళన చెందుతున్న ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రాంతంలో డ్రోన్ల చక్కర్లు మిస్టరీగా మారింది. శుక్రవారం రాత్రి తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని నాలుగు గ్రామాల్లో డ్రోన్లు తిరగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రెండో రోజు శనివారం రాత్రి తాండూరు పట్టణంలో డ్రోన్లు ఆకాశమార్గంలో చక్కర్లు కొట్టాయి. పట్టణంలోని సాయిపూర్, ఇందిరానగర్, మల్ రెడ్డిపల్లి ప్రాంతాలలో సుమారు రెండు నుంచి నాలుగు డ్రోన్లు తిరిగినట్లు కనిపించింది. kvcs అసలు ఈ డ్రోన్లు రాత్రి వేళలోనే ఎందుకు తిరుగుతున్నాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో డ్రోన్లు తిరగడం చాలా సమస్యాత్మకమైన అంశంగా భావించాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. డ్రోన్లు రాత్రి వేళలో తిరగడం వెనుక అక్రమ కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉండొచ్చని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాండూరు పట్టణంలో డ్రోన్లు తిరగడం పై ప్రజలు పలు రకరకాలుగా చర్చలు జరుపుకుంటున్నారు. మరోవైపు డ్రోన్ల చక్కర్ల వెనుక అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో వాటి మిస్టరీ ఎంటో అర్థం కావడం లేదు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39249/