schedule Wednesday, September 09, 2026

టిప్పర్‌ లారీ, ఆర్టీసీ బస్సు డీ

calendar_today November 3, 2025
person dharshininews
టిప్పర్‌ లారీ, ఆర్టీసీ బస్సు డీ
టిప్పర్‌ లారీ, ఆర్టీసీ బస్సు డీ - స్పాట్‌లో టిప్పర్ డ్రైవర్ మృతి - బస్సులో 70 మంది ప్రయాణికులు - తాండూరు డీపోకు చెందిన బస్సు చేవెళ్ల, దర్శిని ప్రతినిధి : కంకర టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో చోటు చేసుకుంది. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆర్టీసీ బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీతో సహాయక చర్యలు చేపట్టారు. kvcs ఘటన జరిగిన సమయంలో తాండూరు డిపోనకు చెందిన ఈ బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంతో హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. చేవెళ్ల-వికారాబాద్‌ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39354/