ఇంటర్ స్పెషల్, సప్లమెంటరీ ఎగ్జామ్స్ లేనట్టే
November 23, 2021
dharshininews
ఇంటర్ స్పెషల్, సప్లమెంటరీ ఎగ్జామ్స్ లేనట్టే
- ప్రకటించిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించింది. కరోనా స్పెషల్ ఎగ్జామ్, అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలపై స్పష్టత ఇచ్చింది.
గత నెలలో ఇంటర్ సెకండియర్‌లోని విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కరోనా బారినపడ్డ విద్యార్థులను పరీక్షకు అనుమతించామని, అలాంటి వారుంటే స్పెషల్ ఎగ్జామ్స్ పెడతామని అప్పట్లోనే ఇంటర్‌బోర్డు ప్రకటించింది. తాజాగా పరీక్షలు ముగియడం, ఈ నెలాఖరున ఫలితాలు సైతం వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బారినపడ్డ విద్యార్థులెవరూ ప్రత్యేక పరీక్ష కోసం ఇంటర్ బోర్డును సంప్రదించలేదు. దీంతో స్పెషల్ పరీక్షను నిర్వహించే ఆలోచనేది లేదని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. వార్షిక పరీక్షలప్పుడే విద్యార్థులందరికీ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ సైతం..
ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులందరికీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అంశంపైనా అధికారులు స్పష్టతనిచ్చారు. ఆయా పరీక్షలను అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జరపబోమని వెల్లడించారు.కానీ, ఇప్పుడు పరీక్షలను నిర్వహించేందుకు సమయం సరిపోకపోవడంతో ఈ అంశాన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.