schedule Tuesday, September 08, 2026

హుండీకి శఠగోపం పెట్టిన దొంగలు

calendar_today November 6, 2025
person dharshininews
హుండీకి శఠగోపం పెట్టిన దొంగలు
హుండీకి శఠగోపం పెట్టిన దొంగలు - హనుమాన్ దేవాలయంలో చోరీ - పెద్దేముల్ మండల కేంద్రంలో ఘటన - దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గుడిలో దైవాన్ని మొక్కేందుకు భక్తులే కాదు.. దేవునికే శఠగోపం పెట్టేందుకు దొంగలు కూడా వస్తుంటారు. అలాంటి సంఘటనే తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల కేంద్రంలో జరిగింది. దేవాలయంలో ఉన్న హుండీలో ఉన్న డబ్బులను  చోరీ  చేశారు. ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో రోజు మాదిరిగానే పూజలు నిర్వహించారు. అన్ని కార్యక్రమాల అనంతరం దేవాలయాన్ని మూసివేశారు. గురువారం ఉదయం వచ్చి చూసే సరికి దేవాలయంలో ఉన్న హుండీ ధ్వంసమై పోయింది. దీంతో దేవాలయంలో దొంగలు పడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. kvcs వెంటనే పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పెద్దేముల్ ఎస్ఐ వేణు దేవాలయానికి చేరుకుని విచారణ ప్రారంభిచారు. ప్రతినిత్యం భక్తులు వేస్తున్న డబ్బులను గుర్తుతెలియని వ్యక్తులు హుండి వెనుక భాగం విడగొట్టి డబ్బులు చోరీ అయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39444/