schedule Saturday, July 04, 2026

ఆర్టీసీ బస్సు బాధితులకు పరిహారం..!

calendar_today November 19, 2025
person dharshininews
ఆర్టీసీ బస్సు బాధితులకు పరిహారం..!
ఆర్టీసీ బస్సు బాధితులకు పరిహారం..! - ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి రూ. 2లక్షలు - నేడు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - ఎంత మందికి అందిస్తున్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 2న చేవేళ్ల మండలం మీర్జాగూడ ఆర్టీసి బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులకు పరిహారం మంజూరైంది. ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన పరిహారాన్ని నేడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయాలపాలు అయ్యారు. మృతి చెందిన వారిలో 13 మంది తాండూరు నియోజకవర్గానికి చెందిన వారు ఉన్నారు. మృతులకు ప్రభుత్వం నుంచి రూ. 5లక్షలు, ఆర్టీసీ సంస్థ నుంచి రూ. 2లక్షలు మొత్తం రూ. 7లక్షల చొప్పున పరిహారం అందించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు పరిహారం మంజూరు కాలేదు. తాజాగా ప్రభుత్వం బాధితులకు ఒక్కొక్కరి చొప్పున రూ. 2లక్షల పరిహారంను మంజూరు చేసింది. దీంతో నేడు బాధితులకు పరిహారం అందించేందకు నిర్ణయించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా నియోజకవర్గానికి చెందిన 10 మంది క్షతగాత్రులకు పరిహారంను అందించబోతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39718/