schedule Saturday, July 04, 2026

చలిపై ఛూమంత్రం..!

calendar_today December 17, 2025
person dharshininews
చలిపై ఛూమంత్రం..!
చలిపై ఛూమంత్రం..! - ఈ డ్రింక్స్‌తో సమస్యలన్నీ ఉఫ్ - అవేంటో తెలుసుకోండి దర్శిని డెస్క్ : చలికాలంలో చలిచంపేస్తోంది. ఎన్నడు లేని విధంగా వేధిస్తున్న చలిలో అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. చలి వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఫలితంగా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెల్త్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆహారంతో కాకుండా డ్రింక్స్‌తో ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఏ డ్రింక్‌ చేస్తే చలి సమస్యలపై ఛూ మంత్రం వేయోచ్చో తెలుసుకోండి. అల్లం, పసుపు శరీరాన్ని లోపలి నుంచి వేడి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటితో తయారు చేసిన పానియం జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ శీతాకాలంలో ఈ టీ తాగడం మంచిది.పసుపు పాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. జలుబు వల్ల కలిగే ఛాతీ నొప్పిని కూడా తగ్గిస్తుంది. శీతాకాలంలో మీ శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడానికి, శరీర బలాన్ని కాపాడుకోవడానికి బెల్లం, జీలకర్ర నీరు తాగవచ్చు. బెల్లం, జీలకర్ర నీళ్లు శరీర జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి జీలకర్ర నీటిని తాగవచ్చు. జీలకర్ర నీటిని తయారు చేయడానికి, ఒక టీస్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఆ నీటిని మరిగించి తాగితే సరి. ఈ సూప్‌లో ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా, శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది ఎముకలు, కండరాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40054/