schedule Monday, September 07, 2026

అతివేగ భీభత్సం..!

calendar_today January 23, 2026
person dharshininews
అతివేగ భీభత్సం..!
అతివేగ భీభత్సం..! - ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ - తాండూరు బస్టాండ్ వద్ద ఘటన - డ్రైవర్, కండక్టర్ ఏమన్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : పొద్దు.. పొద్దున్నే.. తాండూరులో పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడం కలవరం రేపింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు ఆర్టీసీ డీపోకు చెందిన బస్సు మెట్లకుంటకు బయల్దేరింది. బస్సు డ్రైవర్ నారాయణ, కండక్టర్ యాదమ్మలు ప్రయాణికులతో డీపో గేటు నుంచి బయటకు వస్తుండగా కోడంగల్‌ వైపునుంచి వస్తన్న ఓ భారీ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. అతివేగంగా రావడంతో బస్సును అలాగే ముందకు లాక్కెళ్లింది. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరి అయ్యి భయాందోళనకు గురయ్యారు. బస్సు, లారీ ఆగిన వెంటనే ప్రయాణికులు అందులో నుంచి పరుగులు పెట్టారు. లారీ బస్సును ఢీకోనడంతో డ్రైవర్ నారాయణకు గాయాలయ్యాయి. కండక్టర్ యాదమ్మతో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు చికిత్స కోసం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చేరారు. ఎవ్వరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై బస్సు డ్రైవర్ మాట్లాడుతూ లారీ అతివేగంగా రావడంతో పాటు.. బస్సును ముందుకు లాక్కెళ్లిందని తెలిపారు. లారీని గమనించి బస్సును ఆపినా కూడా ఢీకొట్టారని తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40655/