schedule Thursday, September 03, 2026

ఈ నెంబర్‌ను మరవొద్దు..!

calendar_today February 20, 2026
person dharshininews
ఈ నెంబర్‌ను మరవొద్దు..!
ఈ నెంబర్‌ను మరవొద్దు..! - ఎమ్మార్పీ రేట్లపై ఫిర్యాదుకు బెస్ట్ చాయిస్ - నెల రోజుల్లోపే కంప్లైంట్‌పై పరిష్కారం - ఎలా చేయాలో తెలుసుకోండి.. దర్శిని డెస్క్ : వ్యాపారులు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకోవడం చూస్తుంటాం. మన అవసరం కాబట్టి.. అధిక ధరలు అయినా కొనుగోలు చేస్తుంటాం. కొన్ని సార్లు ఈ అధిక ధరలపై ఎవరికైనా ఫిర్యాదు చేయాలని అనిపిస్తుంది. ఎవ్వరికి చేయాలో.. ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. అవకాశం ఉంటే మాత్రం తప్పక చేస్తామని అనుకునే వారికి ఇదోక మంచి సదుపాయం. ఎవరైనా ఎమ్మార్పీ రేట్ల కంటే అధిక ధరలకు విక్రయిస్తే వాట్సాఫ్‌ లోనే ఫిర్యాదు చేయొచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నెంబర్‌ను మాత్రం సేవ్ చేసుకోవాలి. ఒక్కసారి ఫిర్యాదు చేస్తే ఇక వాళ్లే చూసుకుంటారు. నెల రోజుల్లోపే ఇచ్చిన కంప్లైంట్‌కు పరిష్కారం లభించడం ఖాయం. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ 'వాట్సాప్‌ చాట్‌బాట్‌' సేవలను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్​, మరాఠీ సహా ఇతర భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది. MRP కన్నా ఎక్కువ ధరకు అమ్మితే వాట్సప్‌ నెంబర్‌ "88000 01915" ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎక్కువ ధరలకే వస్తువులు అమ్మినప్పుడు నేరుగా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేకుండా కేవలం వాట్సాప్‌ ద్వారానే కంప్లెయింట్​ చేయొచ్చు. మొదట మీ ఫోన్​లో పైన చెప్పిన ఫోన్​ నెంబర్​ను సేవ్​ చేసుకోవాలి. వాట్సాప్​ ఓపెన్​ చేసి ఈ నెంబర్​పై క్లిక్​ చేసి Hi అని టైప్​ చేసి సెండ్​ చేయాలి. అనంతరం మీకు సూట్​ అయ్యే భాషను సెలెక్ట్​ చేసుకోవాలి. అనంతరం పేరు, జెండర్​ వివరాలు ఎంటర్​ చేయాలి. ఆ తర్వాత అక్కడ ప్రాంప్ట్​ ఆధారంగా వివరాలు ఎంటర్​ చేసి సెండ్​ చేయాలి. చివరగా జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో మీ కంప్లైంట్ నమోదవుతుంది. కేసు పూర్తి అయ్యి మీకు పరిష్కారం దొరికే వరకు అవసరమైన సలహాలు, సూచనలు వాట్సాప్ ద్వారా మీకు అందుతాయి. వాట్సాప్​ సేవలతో పాటు టోల్​ఫ్రీ నెంబర్​కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేసుకోవచ్చు. అందుకోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యలో 1915 లేదా 1800-11-4000 కు కాల్‌ చేసి కంప్లెయింట్​ చేయొచ్చు. కేవలం ఈ పద్ధతుల ద్వారా మాత్రమే కాకుండా NCH యాప్​, ఉమాంగ్​ యాప్​ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన తర్వాత పరిష్కారమైన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ https:/consumerhelpline.gov.in/ వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. 'ఎన్‌సీహెచ్‌ సక్సెస్‌ స్టోరీస్‌' పేరుతో వెబ్‌సైట్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. వాటిపై క్లిక్​ చేసి తెలుసుకోవచ్చు. https://www.dharshininews.com/41938/