schedule Wednesday, September 09, 2026

రైతులంద‌రికి రైతు బంధు సాయం

calendar_today December 2, 2021
person dharshininews
రైతులంద‌రికి రైతు బంధు సాయం
రైతులంద‌రికి రైతు బంధు సాయం - తాండూరు మండ‌ల ఏఓ ర‌జిత తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న రైతు బంధు సాయం అంద‌రికి వ‌ర్తిస్తుంద‌ని తాండూరు మండ‌ల వ్య‌వ‌సాయశాఖ అధికారిణి ర‌జిత తెలిపారు. గురువారం తాండూరు వ్య‌వసాయ శాఖ కార్యాల‌యంలో ఆమె మాట్లాడుతూ కొత్త‌గా పాసు పుస్త‌కాలు పొందిన రైతుల నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న రైతుబంధు పథకం కోసం దరఖాస్తులను స్వీకరించడం జ‌రుగుతుంద‌ని తెలిపారు. పాసు పుస్త‌కాలు పొందిన వారితో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు దరఖాస్తు చేయనివారు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్ తీసుకొచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.