కోళ్ల ఫారం బిజినెస్‌కు బంపర్ ఆఫర్..!
March 9, 2026
dharshininews
కోళ్ల ఫారం బిజినెస్‌కు బంపర్ ఆఫర్..!
- వ్యాపారం కోసం రూ. 50లక్షల లోన్
- అందులో మళ్లీ 50శాతం సబ్సీడీ
- కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీం
- అర్హులు, దరఖాస్తుల విధానం తెలుసుకోండి
దర్శిని డెస్క్ : గ్రామీణ ప్రాంతాలోని నిరుద్యోగులకు ఇదొక గొప్ప శుభవార్త. కోళ్ల ఫారం బిజినెస్ పెట్టుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 50లక్షల రుణాలు అందిస్తోంది. ఇందులో మళ్లీ 50శాతం సబ్సీడీ(రాయితీ) అందించనున్నారు. ఈ పథకానికి అర్హులు ఎవరు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, డీపీఆర్ తయారీ, సిబిల్ స్కోరు ప్రాముఖ్యత, శిక్షణ అవశ్యకత వంటి సమగ్ర వివరాలు తెలుసుకోండి.
అర్హులు ఎవరంటే..?
కేంద్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ.50 లక్షల వరకు రుణంపై 50 శాతం రాయితీని పొందవచ్చు. దేశంలోని జాతీయ బ్యాంకులు ఈ పథకం కింద రుణాలను మంజూరు చేస్తాయి. ఎవరైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో వ్యక్తిగత దరఖాస్తుదారులు, స్వయం సహాయ సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు, రైతు సహకార సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, అలాగే సెక్షన్ 8 కిందకు వచ్చే కంపెనీలు అంటే హేచరీలు, కోళ్ల పెంపక కేంద్రాలు సైతం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పోర్టల్ (National Livestock Mission Portal)ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా, మీరు ఏర్పాటు చేయదలచుకున్న కోళ్ల ఫారానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను రూపొందించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
వీరిని సంప్రదించవచ్చు..
ఈ పథకం అమలుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, రాష్ట్ర నోడల్ ఏజెన్సీల ద్వారానే దరఖాస్తులు మీ ప్రాంతంలోని బ్యాంకులకు వెళ్తాయి. మీ ప్రాంతంలోని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారిని లేదా వారి కార్యాలయాన్ని సంప్రదించి ఈ పథకం గురించి మరింత సమాచారం పొందవచ్చు. వారి సహాయంతో దరఖాస్తు ప్రక్రియను కూడా పూర్తి చేయవచ్చు.
నిబంధనలు ఇలా
లోన్ తీసుకోవాలనుకునే వారి పేరిట కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. దానికి సంబంధించిన పత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. ఒకవేళ సొంత భూమి లేకపోతే, కౌలుకు తీసుకున్న భూమిపై కూడా రుణం పొందవచ్చు. అయితే, ఈ సందర్భంలో భూమి యజమానులు మరియు దరఖాస్తుదారు కలిసి జాయింట్‌గా రుణం తీసుకోవాలి. ఆధార్ కార్డ్ , కోళ్ల ఫారం ఏర్పాటు చేయదలచుకున్న భూమి ఫోటో, భూమికి సంబంధించిన పత్రాలు, పాన్ కార్డ్ , ఓటర్ కార్డ్ , రుణం తీసుకోబోయే బ్యాంకులో మీ ఖాతాకు చెందిన రెండు క్యాన్సిల్డ్ చెక్కులు , మాండేటరీ ఫామ్ , చిరునామా ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, విద్యార్హతల పత్రాలు, శిక్షణ పొంది ఉంటే ఆ సర్టిఫికెట్, స్కాన్ చేసిన మీ సంతకం ఫోటో దరఖాస్తు చేసిన తర్వాత, లాగిన్ అయ్యి మీ దరఖాస్తు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. లాగిన్ కోసం మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దరఖాస్తు చేసే సమయంలోనే మీరు దేని కోసం రుణం తీసుకోవాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి. డీపీఆర్, ఇతర పత్రాలను అందులోనే అప్‌లోడ్ చేయాలి.
https://www.dharshininews.com/42341/