schedule Thursday, September 03, 2026

పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి..!

calendar_today March 23, 2026
person dharshininews
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి..!
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి..! - ఫ్రీ ఎప్‌సెట్‌ కోచింగ్ అభినందనీయం - విద్యార్థులకు ఆర్బీఓఎల్ అండగా ఉంటుంది - ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు ఏకాగ్రతతో చదవి పోటీ పరీక్షలలో విజయం సాధించాలని ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం హిందూ ధార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం సిద్దార్థ జూనియర్ కళాశాలలో ఉచితంగా ఈఏపీసెట్(ఎప్‌సెట్‌) కోచింగ్‌ తరగతుల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రతి అంశాలపై అవగాహన, పరిజ్ఞానం పెంచుకోవాలని అన్నారు. విద్యార్థులు గురువుల మార్గదర్శనంలో నిర్దిష్ట ప్రణాళిక, సాధనతో పోటీపరీక్షకు సిద్ధం కావాలని అన్నారు. పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. హిందూ ధార్మిక పరిషత్ గత యేడాది కూడా ఉచితంగా ఎప్‌సెట్‌ కోచింగ్ నిర్వహించడం, పరీక్షల్లో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే టాప్ కాలేజీల్లో సీట్లు సాధించడం సంతోషకరం అన్నారు. ఈ సంవత్సరం కూడా బాలికల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్బీఓఎల్‌ తరపున తమ వంతు సహకారం కూడా అందిస్తామని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ గౌరవ అధ్యక్షులు కరణం పురుషోత్తం రావు, తాండూరు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ జి. నరేందర్, ఎప్‌సెట్‌ కోచింగ్ కన్వీనర్ పర్యాద రామకృష్ణ, హిందూ ధార్మిక పరిషత్ సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, వినోద్ జైన్, పటేల్ విజయ్ కుమార్, జయంత్, శరణు బసప్ప, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42749/