schedule Saturday, July 04, 2026

డ్రైవింగ్‌ లైసెన్స్‌ నాట్ ఈజీ..!

calendar_today March 24, 2026
person dharshininews
డ్రైవింగ్‌ లైసెన్స్‌ నాట్ ఈజీ..!
డ్రైవింగ్‌ లైసెన్స్‌ నాట్ ఈజీ..! - కొత్త రూల్స్ తీసుకవస్తున్న రవాణా శాఖ - అడిషనల్ టెస్ట్ పాసైతేనే అర్హత - ఎందుకోసం అమలు చేస్తున్నారంటే.? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులు పొందే లైసెన్స్‌ నియమాలను మార్చేందుకు రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులు లైసెన్స్‌ పొందడం కఠినంగా మారబోతోంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమేనని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. చాలా మంది డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అందుకే లైసెన్స్ ఇచ్చే ముందు అభ్యర్థులకు తప్పనిసరిగా రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్పులు ఇలా ఈ మార్పుల ప్రకారం ఇప్పటివరకు అమలులో ఉన్న లెర్నర్ లైసెన్స్ (ఎల్‌ఎల్‌ఆర్) పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్‌తో పాటు, ఇకపై మరో అదనపు పరీక్షను తప్పనిసరి చేశారు. కొత్త విధానం ప్రకారం అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాడ్యూల్స్‌కు సంబంధించిన పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత మాత్రమే వారు ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో ఇది తొలి దశగా మారనుంది. ఆ తర్వాత ఎల్‌ఎల్‌ఆర్ పరీక్ష, తదుపరి డ్రైవింగ్ టెస్ట్ సాధారణ విధానంలోనే కొనసాగుతాయి. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ మరింత పారదర్శకంగా, ప్రమాణాలతో కూడినదిగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. https://www.dharshininews.com/42755/