schedule Thursday, September 03, 2026

వాహనదారులకు గుడ్ న్యూస్..!

calendar_today March 27, 2026
person dharshininews
వాహనదారులకు గుడ్ న్యూస్..!
వాహనదారులకు గుడ్ న్యూస్..! - పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు - కేంద్ర ప్రభుత్వం నిర్ణయం - సుంకం ఎత్తెంత తగ్గిందంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : దేశంలోని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని భారీగా తగ్గించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పెట్రోల్‌ పై లీటర్‌కు రూ.13 నుంచి రూ.3కు తగ్గించగా.. డీజిల్‌పై రూ.10ని పూర్తిగా తొలగించింది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయంతో చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నవేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ సుమారు రూ.107.46, డీజిల్ రూ.95.69, దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.77 వద్ద, డీజిల్‌ ధర రూ.87.67 వద్ద కొనసాగుతున్నాయి. వ్యాట్, ఇతరత్రా సుంకాలతో కలిసి రాష్ట్రాల్లో ఈ ధరలు విభిన్నంగా ఉంటాయి. వ్యాట్, ఇతరత్రా సుంకాలతో కలిసి రాష్ట్రాల్లో ఈ ధరలు విభిన్నంగా ఉంటాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. https://www.dharshininews.com/42832/