schedule Saturday, July 04, 2026

50 ట్రాక్టర్ల ఇసుక సీజ్..!

calendar_today April 11, 2026
person dharshininews
50 ట్రాక్టర్ల ఇసుక సీజ్..!
50 ట్రాక్టర్ల ఇసుక సీజ్..! - పెద్దేముల్ పోలీసుల ముమ్మర దాడులు - రెవెన్యూ శాఖకు అప్పగింత పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : అక్రమంగా నిల్వ ఉంచిన 50ట్రాక్టర్ల ఇసుకను పెద్దేముల్ పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. పెద్దేముల్‌ ఎస్ఐ ప్రశాంత్ వర్దన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మదనంతాపూర్ తాండ, కొండాపూర్ గ్రామాల శివారులో కొందరు అక్రమార్కులు అక్రమంగా ఇసుక నిల్వ ఉంచినట్లు పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఐ ప్రశాంత్ వర్దన్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 50ట్రాక్టర్ల వరకు ఇసుకను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఇసుక నిల్వలను సీజ్ చేసి రెవెన్యూ శాఖకు అప్పగించినట్లు ఎస్ఐ ప్రశాంత్‌ వర్దన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసినా.. నిల్వ ఉంచిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. https://www.dharshininews.com/43021/