schedule Tuesday, September 08, 2026

అనుమతుల్లేకుండా ఇసుక రవాణా

calendar_today April 12, 2026
person dharshininews
అనుమతుల్లేకుండా ఇసుక రవాణా
అనుమతుల్లేకుండా ఇసుక రవాణా - మూడు ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు - యజమానులపై కేసులు నమోదు - వెల్లడించిన యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుమతుల్లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను యాలాల పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా రవాణాకు పాల్పడుతున్నట్లు తేలడంతో యజమానులపై కేసులు నమోదు చేశారు. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం అగ్గనూరు గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఇసుక రవాణా చేస్తుండగా యాలాల పోలీసులు దాడులు నిర్వహించారు. ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్ల రవాణాలో ఎలాంటి అనుమతి పత్రాలు లేనట్లుగా గుర్తించారు. రియాజ్, మల్కాన్‌గిరి నాగరాజు, కోడంగంటి గోపాల్‌ను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. https://www.dharshininews.com/43048/