schedule Saturday, July 04, 2026

టీజీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

calendar_today April 13, 2026
person dharshininews
టీజీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల
టీజీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల - ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు - పరీక్ష ఫీజు, విధానాలు ఖరారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫీకేషన్‌ జారీ అయ్యింది. దరఖాస్తులు స్వీకరణ, పరీక్ష ఫీజు, అర్హతలు, విధి విధానాలను ఈ నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 14న పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఏప్రిల్ 15 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. టీజీటెట్ కోసం అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. జూన్ 15 నుండి జూన్ 30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను జూన్ 9 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పరీక్షా ఫలితాలు జూలై 28 నుండి 31 మధ్య ప్రకటించే అవకాశం ఉంది. మంగళవారం నుండే పూర్తిస్థాయి నోటిఫికేషన్ అందుబాటులోకి రానుండగా ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. TGTETలో Paper-I (I to V తరగతులు), Paper-II (VI to VIII తరగతులు) ఉంటాయి. I to VIII అన్ని తరగతులకు ఉపాధ్యాయులు కావాలనుకునేవారు రెండు పేపర్లు రాయాలి. D.El.Ed, B.Ed, లాంగ్వేజ్ పండిట్ లేదా సమాన యోగ్యతలు ఉన్నవారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫీజు విషయానికి వస్తే.. జనరల్, బీసీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ. 950 ఫీజు చెల్లించాలి. గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు కూడా తమ స్కోర్ పెంచుకోవడానికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. https://www.dharshininews.com/43014/