schedule Thursday, September 03, 2026

జీరా నీరులో అద్భుతాలు..!

calendar_today April 15, 2026
person dharshininews
జీరా నీరులో అద్భుతాలు..!
జీరా నీరులో అద్భుతాలు..! - రోజూ తాగితే వేసవిలో బాడీ కూల్‌ - కొవ్వును కరిగించే మంత్రం దర్శిని డెస్క్ : ఆరోగ్యం కోసం చాలా మంది జీలకర్ర నీరును తాగేందుకు ఇష్టపడుతుంటారు. సోంపు నీరు, మెంతుల నీరు, సెలెరీ వాటర్ వంటివి జాబితాలో ఉన్నప్పటికీ.. అందరూ ఎక్కువగా ఇష్టపడేది మాత్రం జీలకర్ర నీరు. అయితే ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. దీనిని సరైన పద్ధతిలో తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఈ నీటిని ఎప్పుడు తాగాలి? ఎలా తయారు చేయాలి? అనే విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండదు. అతిగా తాగడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీలకర్ర నీటిని తాగడానికి ఉత్తమ సమయం ఉదయం ఖాళీ కడుపుతో తాగడం. ఒకవేళ ఉదయం వీలు పడకపోతే, భోజనం చేసిన తర్వాత చిన్న చిన్న సిప్స్ తీసుకుంటూ తాగవచ్చు. ఇలా చేయడం వల్ల భోజనం తర్వాత కలిగే కడుపు ఉబ్బరం లేదా భారంగా ఉండే సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరంలో కలిగే మంటను తగ్గించి, చల్లదనాన్ని ఇవ్వడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది మందకొడిగా ఉన్న జీర్ణశక్తిని ఉత్తేజపరుస్తుంది. మన శరీరంలోని విషపూరిత పదార్థాలను బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆకలి లేమితో బాధపడేవారికి ఇది గొప్ప ఉపశమనం. అయితే చాలామంది త్వరగా ఫలితం రావాలని రోజంతా ఈ నీటిని సిప్ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల ఆశించిన ప్రయోజనం అందకపోవచ్చు. ఏదైనా సరే మితంగా తీసుకున్నప్పుడే అది ఔషధంగా పనిచేస్తుంది. మోతాదుకు మించి తీసుకోవడం లేదా సరైన పద్ధతి పాటించకపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. తయారు చేసుకునే పద్దతి ఒక స్పూన్ జీలకర్రను రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు రంగు మారే వరకు మరిగించడం వల్ల జీలకర్రలోని పోషకాలు నీటిలోకి చేరుతాయి. మరిగించిన నీటిని వడకట్టి, అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి. మరీ వేడి నీటిని తాగడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. https://www.dharshininews.com/42197/