schedule Saturday, July 04, 2026

అనుమతి లేకుండా ఎద్దుల రవాణా

calendar_today May 10, 2026
person dharshininews
అనుమతి లేకుండా ఎద్దుల రవాణా
అనుమతి లేకుండా ఎద్దుల రవాణా - తనిఖీలో వ్యక్తిపై పోలీసుల కేసు తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుమతి లేకుండా రెండు ఎద్దులను తరలిస్తున్న వ్యక్తిపై తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ బొంగు పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన రసూల్ అనే వ్యక్తి మహరాష్ట్రలో కొనుగోలు చేసిన రెండు ఎద్దులను తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని రైతుకు విక్రయించాడు. రసూల్‌కు కొంత డబ్బులు ఇచ్చి మిగతావి తరువాత ఇస్తానని చెప్పి ఒప్పందం చేసుకున్నాడు. రసూల్‌కు మిగతా డబ్బులు రాకపోవడంతో ఆదివారం బషీరాబాద్ మండలం నుంచి ఎత్తును గాజీపూర్ గ్రామానికి తరలించారు. అయితే బక్రీద్ సందర్బంగా తాండూరు పట్టణ పోలీస్టేషన్ ఆధ్వర్యంలో మార్గ మద్యలోని అంతారం గేటు వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రసూల్ తరలిస్తున్న ఎద్దుల రవాణాను తనిఖీ చేశారు. తరలింపుకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో రసూల్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అనుమతులు లేకుండా గోవులు, ఎద్దులను, మూగ జీవాలను తరలించరాదని, లేదంటే చట్ట రిత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. https://www.dharshininews.com/43276/