schedule Thursday, September 03, 2026

బీసీ మహిళలకు గుడ్‌న్యూస్..!

calendar_today August 13, 2026
person dharshininews
బీసీ మహిళలకు గుడ్‌న్యూస్..!
బీసీ మహిళలకు గుడ్‌న్యూస్..! - ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - 100 శాతం సబ్సిడీపై పంపిణీ - దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచి అంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వంహైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీసీ మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.శుభవార్త చెప్పింది. బీసీ మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనుంది. ఈ పథకం కింద సుమారు రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్‌ను 100 శాతం సబ్సిడీపై అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.19 లక్షల మంది బీసీ మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ముఖ్యంగా పేద, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కుట్టు మిషన్‌తో ఇంటి నుంచే ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచే అవకాశం మహిళలకు కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో ఈ పథకంపై బీసీ మహిళల్లో ఆసక్తి నెలకొంది. https://www.dharshininews.com/44171/