schedule Thursday, September 03, 2026

అక్రమ ఇసుక లారీ చేజ్.. సీజ్..!

calendar_today August 19, 2026
person dharshininews
అక్రమ ఇసుక లారీ చేజ్.. సీజ్..!
అక్రమ ఇసుక లారీ చేజ్.. సీజ్..! - వెంబడించి పట్టుకున్న పోలీసులు - బషీరాబాద్ పోలిస్టేషన్ లో కేసు నమోదు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన బషీరాబాద్‌ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బషీరాబాద్‌ ఎస్సై విఠల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు నుంచి బషీరాబాద్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు లారీ(టీఎస్‌ 12 యూఏ 6803)ని వెంబడించి పట్టుకున్నారు. లారీని బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలపై మంబాపూర్‌ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ సోహెల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విఠల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. https://www.dharshininews.com/44269/