schedule Tuesday, November 03, 2026

బల్దియలో విజయదశమి సందడి..!

calendar_today October 19, 2026
person dharshininews
బల్దియలో విజయదశమి సందడి..!
బల్దియలో విజయదశమి సందడి..! - యంత్రాలకు చైర్‌పర్సన్‌ పూజలు - ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్‌ కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి పాల్గొని కార్యాలయానికి చెందిన జేసీబీ, ఆటోలు, ఇతర యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయంలో పండుగ సందడి నెలకొంది. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. తాండూరు ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చైర్‌పర్సన్‌ తెలిపారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్‌ సేవలు అందించడంలో యంత్రాలు, వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని, వాటికి విజయదశమి సందర్భంగా పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Pvr https://www.dharshininews.com/45153/