schedule Tuesday, November 03, 2026

‘దిగ్విజయ’ దశమిని జరుపుకుందాం..!

calendar_today October 19, 2026
person dharshininews
‘దిగ్విజయ’ దశమిని జరుపుకుందాం..!
‘దిగ్విజయ’ దశమిని జరుపుకుందాం..! - దసరా ఉత్సవాలకు హిందూ ఉత్సవ సమితి పిలుపు - గంజ్‌ రేణుకా ఎల్లమ్మ ఆలయం నుంచి ర్యాలీ తాండూరు, దర్శిని ప్రతినిధి: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తాండూరులో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న దసరా ఉత్సవాలను విజయవంతం చేసి, ‘దిగ్విజయ’ దశమిని జరుపుకోవాలని హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు. గంజ్‌లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుంచి దసరా ర్యాలీ ప్రారంభమై పట్టణ పురవీధుల గుండా కొనసాగి, పాత తాండూరులోని బోనమ్మ గుడి వద్దకు చేరుకోనుంది. అక్కడ దసరా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. దసరా ఉత్సవాల్లో హైందవ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవాలను సమష్టిగా నిర్వహించి విజయదశమి వేడుకలను వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు హిందూ ఉత్సవ సమితి కార్యదర్శి బీర్కట్‌ రఘు, అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ, ఇతర ప్రతినిధులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. Pvr https://www.dharshininews.com/45155/