schedule Tuesday, November 03, 2026

ముగిసిన దసరా కప్‌-2026

calendar_today October 22, 2026
person dharshininews
ముగిసిన దసరా కప్‌-2026
ముగిసిన దసరా కప్‌-2026 - విజేతగా హైదరాబాద్‌ భార్కస్‌ - రన్నరప్ గా నిలిచిన తాండూరు జట్టు - అభినందించిన శంకర్ యాదవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ అండ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన దసరా కప్‌–2026 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ఉత్సాహభరితంగా ముగిసింది. మొత్తం ఎనిమిది జట్లు ఈ పోటీల్లో పాల్గొనగా చివరకు హైదరాబాద్‌ భార్కస్‌ జట్టు విజేతగా నిలచింది. ఆతిథ్య తాండూరు జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. టోర్నమెంట్‌లో భాగంగా హైదరాబాద్‌ భార్కస్‌, తాండూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్ల క్రీడాకారులు విజయం కోసం తమ ప్రతిభను ప్రదర్శించగా, చివరకు హైదరాబాద్‌ భార్కస్‌ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. తాండూరు జట్టు రెండో స్థానంతో రన్నరప్‌గా నిలిచింది. టోర్నమెంట్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించిన సాయి పుత్ర హోమ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ ఎండీ శంకర్‌ యాదవ్‌ బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తో కలిసి విజేతలకు కప్‌లు, మెడల్స్‌ అందజేశారు. ఫైనల్‌లో పాల్గొన్న ఇరు జట్ల క్రీడాకారులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవడంతో పాటు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్‌ గౌడ్‌, బంటు మల్లప్ప, బెన్నూర్‌ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45167/