భవాని భక్తుల సేవలో పైలెట్ రోహిత్‌రెడ్డి..!
October 25, 2026
dharshininews
భవాని భక్తుల సేవలో పైలెట్ రోహిత్‌రెడ్డి..!
- తుల్జాపూర్‌లో పాదయాత్రికులకు మహాప్రసాదం పంపిణీ
- బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తుల్జాపూర్ భవానీ మాత దర్శనం కోసం పాదయాత్రగా తరలివచ్చే భక్తులకు అన్నదాన సేవ అందించేందుకు నిర్వహించిన మహాప్రసాద కార్యక్రమంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు.
మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా తుల్జాపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన భక్తులకు సేవలందించారు. తుల్జాపూర్ శ్రీ తుల్జా భవానీ మాత దర్శనానికి మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు భోజన సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో మహాప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పైలెట్ రోహిత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. భక్తులకు ఆహారం అందించే ఇటువంటి కార్యక్రమాలు పాదయాత్రికులకు తోడ్పాటునందించడంతో పాటు సేవాభావాన్ని చాటుతాయని రోహిత్ రెడ్డి అన్నారు.
అనంతరం పలువురు అమ్మవారిని దర్శనానికి వచ్చిన రోహిత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నరేందర్ గౌడ్, రుద్రుపాటిల్, దత్తాత్రేయ, రఘుమారెడ్డి, యువకులు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45178/