schedule Tuesday, November 03, 2026

మార్మోగిన హనుమాన్‌ నామస్మరణ!

calendar_today October 25, 2026
person dharshininews
మార్మోగిన హనుమాన్‌ నామస్మరణ!
మార్మోగిన హనుమాన్‌ నామస్మరణ! - మంబాపూర్‌లో 50వ వారానికి చేరిన హనుమాన్‌ చాలీసా పారాయణం - ముఖ్య అతిథిగా హాజరైన కథా వాచక్‌ అడికె కార్తీక్‌ పెద్దేముల్‌, దర్శిని ప్రతినిధి: హనుమాన్‌ నామస్మరణతో మంబాపూర్‌ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పెద్దేముల్‌ మండలంలోని మంబాపూర్‌లో ప్రతి వారం నిర్వహిస్తున్న హనుమాన్‌ చాలీసా పారాయణం ఆదివారంతో 50వ వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పఠించారు. వరుసగా 50 వారాల పాటు కొనసాగుతున్న హనుమాన్‌ చాలీసా పారాయణం సందర్భంగా గ్రామంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హనుమాన్‌ కథా వాచక్‌ అడికె కార్తీక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించడంతో పాటు ఆంజనేయస్వామి చరిత్ర, భక్తి విశిష్టతను వివరించారు. హనుమాన్‌ చాలీసా పఠనం, ఆంజనేయస్వామి నామస్మరణతో కార్యక్రమ ప్రాంగణం భక్తిమయంగా మారింది. 50వ వారానికి చేరుకున్న పారాయణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆంజనేయస్వామిని స్మరిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. https://www.dharshininews.com/45188/