తాండూరు యువతకు శుభవార్త..!
October 26, 2026
dharshininews
తాండూరు యువతకు శుభవార్త..!
- బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
- 28న స్పీకర్ చేతుల మీదుగా అందజేతకు నిర్ణయం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అవసరమైన అధ్యయన సామగ్రిని అందించేందుకు తాండూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలోని బీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ నెల 28న ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తాండూరులోని విలియం మూన్ స్కూల్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమం జరగనుంది.
ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా చదువుతున్న యువతకు సహకరించాలనే ఉద్దేశంతో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా అధ్యయన సామగ్రి అందించనున్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది. పోటీ పరీక్షల అభ్యర్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
https://www.dharshininews.com/45192/