schedule Saturday, September 05, 2026

ఊరూర మొహ‌ర్రం సంద‌డి

calendar_today August 19, 2021
person dharshininews
ఊరూర మొహ‌ర్రం సంద‌డి
ఊరూర మొహ‌ర్రం సంద‌డి - మొక్క‌లు తీర్చుకుంటున్న భ‌క్తులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు నియోజ‌క‌ర్గంలో ఊరూరా మొహ‌ర్రం వేడుక‌లు సంద‌డిగా కొన‌సాగుతున్నాయి. తాండూరు, పెద్దేముల్, యాలాల‌, బ‌షీరాబాద్ మండ‌లాల్లోని అన్ని గ్రామాల్లో మ‌సీదుల్లో పీర్ల‌ను ప్ర‌తిష్ఠించారు. మొహ‌ర్రం సంద‌ర్భంగా భ‌క్తులు పీర్ల‌ను ద‌ర్శించుకుని భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. రాత్రి వేళ‌ల్లో మ‌సీదుల వ‌ద్ద అలాయి ముందు యువ‌కులు, పెద్ద‌లు డ‌ప్పు, వాయిద్యాల మ‌ద్య ఆట‌పాట‌లాడుతూ ఉత్స‌హాంగా వేడుక‌ల‌ను జ‌రుపుకుంటున్నారు. మ‌హిళ‌లు ఆశ‌న.. హుసేనాలాల అంటూ పాట‌లు పాడుతూ అడుగుల నృత్యాలు చేస్తున్నారు. ప్రార్థ‌న‌ల అనంత‌రం ప్ర‌తిష్టించిన పీర్ల‌ను ఊరేగింపు నిర్వ‌హించి మొక్కులు తీర్చుకుంటున్నారు.