schedule Saturday, July 11, 2026

మువ్వెన్నెల రెప రెపలు...!

calendar_today January 26, 2022
person dharshininews
మువ్వెన్నెల రెప రెపలు...!
మువ్వెన్నెల రెప రెపలు...! - జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు - వందనం సమర్పించిన ప్రజా ప్రతినిధులు తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మండలంలో మువ్వెన్నెల జెండా రెప రెపలాడింది. బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాండూరు తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, పశువైద్యశాల, వ్యవసాయ శాఖ కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాలో జెండా పండగను జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఇంచార్జ్ ఎంపీడీఓ రతన్ సింగ్, చైల్డ్ లైన్ కార్యాలయంలో తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, ఎల్మకన్నె సహాకార సంఘ కార్యాలయంలో చైర్మన్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ వెంకటయ్యగౌడ్, ఐసీడీ ఎస్ కార్యాలయంలో సీడీపీఓ రేణుక, ఐకేపీ కార్యాలయంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మొగులమ్మ, పశువైద్య శాఖ కార్యాలయంలో ప్రభురాజ్, వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏడీఏ రుద్రమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో డీఈ రమేష్. పంచాయతీరాజ్లో డీఈ వెంకట్ రావులు జెండా ఆవి ష్కరించారు. వివిధ కార్యాలయాల వద్ద ఆయా శాఖల అధికారులు జెండా ఎగురవేశారు. మరోవైపు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, పలు పార్టీల నాయకులు, యువనాయకులు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, సిబ్బంది జెండా వందనం సమర్పించారు.