schedule Saturday, July 11, 2026

త్రివర్ణ శోభితం.!

calendar_today January 26, 2022
person dharshininews
త్రివర్ణ శోభితం.!
త్రివర్ణ శోభితం.! - మురిసిన మువ్వెన్నెలు - వాడ వాడలా ఎగిరిన జాతీయ జెండా - ఆవిష్కరించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తాండూరులోని ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీ కార్యాలయాలు, సంఘాల కార్యాలయాలతో పాలు వాడ వాడలన్నీ త్రివర్ణ శోభితంగా మారాయి. వాడ వాడలా ఎగిరిన మువ్వెన్నెల జెండా మురిసిపోయింది. జాతీయ గీతంతో మార్మోగిన జెండాకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, చిన్నారులు జైహో అంటూ వందనం సమర్పించారు. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, తాండూరు ఆర్డీఓ కార్యాలయం, పాత తాండూరు అంబేద్కర్ పార్కు, మున్సిపల్ నూతన కార్యాలయంలో ఆర్డీఓ అశోక్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు, నాయకులతో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ విఠల్ నాయక్, తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ పోలీస్టేషన్లో సీఐ రాజేందర్ రెడ్డి, జిల్లా ఆసుపత్రిలో సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్, వివిధ కార్యాలయాల వద్ద ఆయా శాఖల అధికారులు, సంఘాల ఆధ్వర్యంలో ప్రతినిధులు, అంగన్ వాడి కేంద్రాల్లో కౌన్సిలర్లు జాతీయ జెండాలను ఆవి ష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.