schedule Thursday, September 03, 2026

ఆక‌ర్షిస్తున్న ఆర్టీసీ కార్గో సేవ‌లు

calendar_today January 28, 2022
person dharshininews
ఆక‌ర్షిస్తున్న ఆర్టీసీ కార్గో సేవ‌లు
ఆక‌ర్షిస్తున్న ఆర్టీసీ కార్గో సేవ‌లు - స్లాబు చార్జీల‌ను త‌గ్గించిన సంస్థ‌ - స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరుతున్న అధికారులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఆధాయాన్ని పెంచుకునేందుకు ఆర్టీసీ సంస్థ ప్ర‌యోగాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన కార్గో సేవ‌లు విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్నాయి. వినియోగ‌దారులతో పాటు ప‌లువురు వ్యాపారుల‌కు కార్గో సేవ‌ల‌ను అధికారులు మ‌రింత ద‌గ్గ‌ర చేసేందుకు ప్ర‌త్యేక దృష్టిసారిస్తున్నారు. అప్పుడ‌ప్పుడు విభిన్న ఆఫ‌ర్ల‌తో ఆక‌ర్షిస్తూ త‌మ‌వైపు తిప్పుకుంటున్నారు. తాజాగా స్లాబు ధ‌ర‌ల‌ను మ‌రింత త‌గ్గించి ఆక‌ర్షిస్తున్నారు. ఈ నెల 21 నుంచి త‌గ్గిన స్లాబు ధ‌ర‌లు అమ‌ల్లోకి రావ‌డంతో వినియోగ‌దారులు, వ్యాపారులు కార్గో సేవ‌ల‌పై ఆస‌క్తి చూపుతున్నారు. ఈ విధానం వ‌ల్ల వినియోగ‌దారుల‌కు మ‌రింత లాభం చేకూర్చేందుకు ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం జ‌రిగింద‌ని పేర్కొంటున్నారు. పార్శిళ్ల సేవ‌ల‌ను వినియోగ‌దారులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు. పాత ధ‌ర‌లు ఇలా.. 0 నుంచి 50 కిలోమీట‌ర్ల ల‌గేజీకి బ‌రువు(కిలోలు) - చార్జీ(రూ.ల‌లో) 0-5                      - 30 6-25                    - 70 26-50                  - 100 51-75                  - 130 76-100                - 160 కొత్తధ‌ర‌లు ఇలా 0 నుంచి 50 కిలోమీట‌ర్ల ల‌గేజీకి బ‌రువు(కిలోలు) - చార్జీ(రూ.ల‌లో) 0-5                       -30 6-10                    - 60 11-25                   -70 26-30                  - 80 31-35                  - 90 36-40                  - 100 41-50                  - 110 51-55                  - 120 56-65                  -130 66-75                  -140 76-85                  -150 86-95                  -160 96-100                -170